సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు సోమవారం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. LG కంపెనీలో భాగమైన LS కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రికల్ కేబుల్స్,గ్యాస్, ఎనర్జీ బ్యాటరీల తయారీ కోసం పెట్టుబడులు పెట్టేందుకు LS కంపెనీని సీఎం రేవంత్ స్వాగతించారు. త్వరలోనే LS బృందం రాష్ట్రాన్ని సందర్శించనుందన్నారు.
కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్ ఇండస్ట్రీ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కొరియన్ టెక్స్ టైల్స్ కంపెనీలను వరంగల్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. టెక్స్ టైల్ రంగానికి అన్ని విధాలా వరంగల్ అనుగుణంగా ఉంటుందని వివరించారు సీఎం రేవంత్.