జోకులు, సెటైర్లు..సీఎం, మంత్రుల సరదా ముచ్చట్లు

జోకులు, సెటైర్లు..సీఎం, మంత్రుల సరదా ముచ్చట్లు

సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు ప్రతి రోజు  బిజిబిజీ షెడ్యూల్ తో క్షణం  తీరిక  లేకుండా గడుపుతుంటారు. మీటింగ్ లు, సమీక్షలు, ప్రెస్ మీట్ లు, ప్రారంభోత్సవాలతో  ఎప్పుడు చూసినా ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంటారు. అందరు కలుసుకుని మాట్లాడటం చాలా అరుదు. అయితే ఇలాంటి అరుదైన ఘటన ఏప్రిల్ 1న హైదరాబాద్ లో జరిగింది.  

ALSO READ | సన్న బియ్యం స్కీమ్ నిరుపేదల ఆత్మగౌరవ పథకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అవును హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూం దగ్గర సీఎం రేవంత్ ,పలువురు మంత్రులు తమ బిజీ లైఫ్ ను పక్కన పెట్టి కాసేపు  రొటీన్ లైఫ్ లోకి వచ్చారు.  సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి ఒకేచోట  సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఒకరిమీద ఒకరు జోకులేసుకుంటూ, పడిపడి నవ్వుకుంటూ కనిపించారు. సీఎం ,మంత్రుల సరదా ఎపిసోడ్ ను మంత్రి సీతక్క తన కెమెరాలో వీడియో తీశారు.ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.