నారాయణపేటలో సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం

నారాయణపేటలో సీఎం ఫొటోలకు క్షీరాభిషేకం

నారాయణపేట/ఆమనగల్లు/మరికల్/వంగూర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. నారాయణపేటలో సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రేవంత్​రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంతో పాటు రాజీవ్  యువ వికాస్  పథకాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లులో సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. మరికల్​లో పార్టీ శ్రేణులు బైక్​ ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌరస్తాలో సోనియాగాంధి, రాహుల్​గాంధి, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.