నేడు ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్

నేడు ఢిల్లీకి సీఎం, పీసీసీ చీఫ్
  • రేపు సీడబ్ల్యూసీ మీటింగ్​కు హాజరు
  • మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో గురువారం జరిగే కాంగ్రెస్  వర్కింగ్  కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేశ్  కుమార్  గౌడ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్  నుంచి బయలుదేరనున్నారు. అలాగే సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనర్సింహ, వంశీ చంద్  రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్  రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్  అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్,  మహేశ్  కుమార్  గౌడ్  కలిసే అవకాశం ఉంది. ఒకవేళ వారు సమయమిస్తే మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్  అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుపై అగ్రనేతలు ఫోకస్  పెట్టడంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్  గ్రీన్ సిగ్నల్  ఇస్తుందో లేదోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.