ఎస్సీ వర్గీకరణపై కమిటీ : సీఎం రేవంత్​

ఎస్సీ వర్గీకరణపై కమిటీ : సీఎం రేవంత్​
  • రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తా
  • తనను కలిసిన మాల ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలకు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటించారు. ఆ కమిటీ అన్నింటినీ స్టడీ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సెక్రటేరియెట్​లో మాల సామాజిక వర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, మట్టా రాగమయి, నాగరాజు, మాల మహానాడు నేతలు చెన్నయ్య తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై కోర్టు డైరెక్షన్​కు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే, ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం రేవంత్​ రెడ్డిని వారు కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీని నియమించి ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.