ఇక టైమ్ వచ్చింది.. మీ అందరి మద్దతు కోరుతున్నా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే సందర్భం వచ్చిందని.. ఆయనను ప్రధానిని చేయడం కోసం మీ అందరి మద్దతు కోరుతున్నానని క్రిస్టియన్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మణిపూర్‎లో క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. కానీ రాహుల్ గాంధీ స్వయంగా అక్కడికి వెళ్లి వారి బాధలను అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. 

నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దళితులు, గిరిజనుల పక్షాన నిలబడ్డారని.. పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. తెలంగాణలో మీ మద్దతు మా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించడం ప్రాథమిక హక్కు అని.. కానీ రాజకీయ స్వార్థం కోసం కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కల్వరి టెంపుల్ వ్యస్థాపకులు సతీష్ కుమార్ జన్మదినం సందర్బంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కృతజ్ఞత ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కల్వరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు.. కానీ చూశాక ఒక అద్భుతం అనిపించిందని అన్నారు. కల్వరి టెంపుల్ నిర్వహించడం ఒక సతీష్ కుమార్‎కే సాధ్యమని అభినందించారు. 

కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్‎కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సతీష్ కుమార్ సమాజసేవకు అంకితమై 35 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ థాంక్స్ గివింగ్ సెలెబ్రేషన్స్ ఎప్పుటికి గుర్తుండి పోతాయన్నారు. నా ప్రమాణస్వీకారం రోజు ఎల్బీ స్టేడియంలో అభిమానులు ఏ విధంగా స్వాగతం పలికారో.. ఈ రోజు అదే సంతోషం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్వాసం, సేవ, విద్య, వైద్యం ప్రజలకు అందించేందుకు క్రిస్టియన్ మిషనరీస్ తీసుకువచ్చారని అన్నారు. 

అతి తక్కువ ధరకు న్యాణమైన విద్య అందిస్తున్నది కేవలం క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమేనని.. క్రిస్టియన్ మిషషనరీ స్కూల్స్‎ను ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటల్ బిల్లులు చూసి ప్రజలు భయపడుతున్న ఈ రోజుల్లో.. క్రిస్టియన్ మిషినరీస్ నిర్వహిస్తున్న హాస్పిటల్స్‏లో తక్కువ ధరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. ప్రతీ ఆదివారం మీరు చేసే ప్రార్థనలో  రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన అవ్వాలని ప్రార్ధించాలని కోరుతున్నానని.. నేను చేసే ప్రయత్నంతో పాటు దైవ అనుగ్రహంతో డ్రగ్స్, గంజాయి నిర్మూలిస్తామని నమ్ముతున్నానని పేర్కొన్నారు.