హైడ్రా ఛైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి

 ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు,విపత్తు  నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా( మైదరాబాద్ డిజాస్టర్, రెస్పాన్స్ అండ్ అసెట్స్) ఛైర్మన్ గా  సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా రెవెన్యూ మంత్రి  ఉమ్మడి రంగారెడ్డి ,హైదరాబాద్ మంత్రులు వీరితో పాటు  సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ జీహెచ్ఎంసీ మేయర్ ఉండనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు  ఆస్తుల పరిరక్షణ, విప్తతు సంరక్షణపై పనిచేయనుంది హైడ్రా. 

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న ఎన్​ఫోర్స్​మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ ​హైదరాబాద్​ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్​పెట్టేందుకు హైడ్రా పనిచేస్తుంది.

ఈ వింగ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ పరిధిలోనే పని చేస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్, పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకుంటూ హైడ్రా పని చేయాలని.. అందుకు తగ్గట్టు దాని వ్యవస్థాగత నిర్మాణం, విధివిధానాలు ఉండాలని సూచించారు.