- 12 మందితో గవర్నింగ్ బాడీ
- ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ.. విధివిధానాలు ఖరారు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్) విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా అధికార పరిధిని విస్తరించింది. హైడ్రా చైర్మన్‌గా సీఎం, హైడ్రా కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, మున్సిపల్ మంత్రి, సీఎస్, డీజీపీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సి పల్ సెక్రటరీలు, జీహెచ్‌ఎంసీ మేయర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ సభ్యులుగా ఉంటారు.
ఈ మేరకు సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)లో విపత్తు నిర్వహణ కోసం ఒక్కటే ఏజెన్సీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు జీవోలో తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్ఆర్వరకు ఉన్న ప్రాంతాలతో కూడిన ఏరియాను కోర్ అర్బన్రీజియన్గా పేర్కొన్నారు. టీసీయూఆర్ డిజాస్టర్మేనేజ్మెంట్సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
దీనికి మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ అండ్‌అర్బన్ డెవల ప్మెంట్ప్రిన్సిపల్సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఉండను న్నారు. హైడ్రా కమిషనర్ మెంబర్‌కన్వీనర్‌గా, డిజాస్టర్ మెనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్, ఫైర్సర్వీసెస్ డీజీ, జలమండలి ఎండీ, హెచ్ఎం డీఏ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎంఆర్ఎల్ఎండీ, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ, టీసీయూఆర్ పరిధిలో ఉన్న జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్కమిషనర్లు, నామినేటెడ్మెంబర్లు సభ్యులుగా ఉంటారు.