కొండపోచమ్మ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్లో యువకులు గల్లంతవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాదీశారు. గల్లంతైన యువకుల గాలింపు కోసం గజఈతగాళ్లను రంగంలోకి దించాలని అధికారులను ఆదేశించారు.  ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ  సమాచారాన్ని తనకు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు.

ఐదుగురు యువకులు మృతి చెందడంపై  సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

జనవరి 11న సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఏడుగురు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే.. గజఈతగాళ్లు ఇద్దరిని రక్షించారు..మరో ఐదురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ఈత కొట్టడానికి వెళ్లి అందులో జారి పడి గల్లంతైనట్లు తెలిపారు. ఐదుగురి మృతదేహాల  కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.