- నియమించాలని అల్కాలాంబకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్గా గద్వాలకు చెందిన సరితా తిరుపతయ్య యాదవ్ ను నియమించాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబను సీఎం రేవంత్రెడ్డి కోరారు.
పీసీసీ చీఫ్ హోదాలో గత నెల 11న ఆమెకు లేఖ రాశారు. బుధవారం ఈ లేఖను బయటపెట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సరితా తిరుపతయ్య గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.