తెలంగాణనికి అదనపు ఐపీఎస్​లను కేటాయించండి : రేవంత్

తెలంగాణనికి అదనపు ఐపీఎస్​లను కేటాయించండి : రేవంత్
  •     విభజన టైమ్​లో 61 ఐపీఎస్ పోస్టులు ఇచ్చారు.. మరో 29 పోస్టులు కావాలి
  •     కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు సీఎం రేవంత్​ వినతి
  •     టీజీ న్యాబ్​కు రూ.88 కోట్లు, టీజీసీఎస్‌‌‌‌బీకి రూ.90 కోట్లు ఇవ్వండి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్‌‌‌‌), తెలంగాణ సైబ‌‌‌‌ర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌‌‌‌బీ) ఆధునీక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మైన నిధులు మంజూరు చేయాల‌‌‌‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.  ఢిల్లీలో అమిత్​షాను ఆయ‌‌‌‌న నివాసంలో గురువారం సీఎం క‌‌‌‌లిశారు. సుమారు గంట‌‌‌‌పాటు భేటీ అయ్యారు. డ్రగ్స్,  సైబర్ నేరాల‌‌‌‌ను అరికట్టడానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, ప‌‌‌‌రిక‌‌‌‌రాల‌‌‌‌ కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌‌‌‌కు రూ. 88 కోట్లు, టీజీ సీఎస్‌‌‌‌బీకి రూ. 90 కోట్లు కేటాయించాల‌‌‌‌ని కేంద్ర హోంమంత్రికి సీఎం విన్నవించారు. 

ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఐపీఎస్  కేడర్ సమీక్ష చేయడం తప్పనిసర‌‌‌‌ని, తెలంగాణ‌‌‌‌కు సంబంధించి 2016లో మొదటిసారి సమీక్ష నిర్వహించార‌‌‌‌ని, నాటి నుంచి స‌‌‌‌మీక్ష చేయలేదని, వెంట‌‌‌‌నే స‌‌‌‌మీక్ష చేపట్టాలన్నారు. విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించార‌‌‌‌ని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌‌‌‌లు సరిపోవడం లేదని, అద‌‌‌‌నంగా 29 ఐపీఎస్‌‌‌‌ పోస్టులను కేటాయించాల‌‌‌‌ని ఆయన కోరారు. 

తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన చత్తీస్‌‌‌‌గ‌‌‌‌ఢ్‌‌‌‌, మ‌‌‌‌హారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసిన విష‌‌‌‌యాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో కూడా ఇదే విధమైన క్యాంపులను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా గ‌‌‌‌తంలో ఉండి తొల‌‌‌‌గించిన మూడు జిల్లాల‌‌‌‌ను ఎస్ఆర్ఈ (భ‌‌‌‌ద్రతాప‌‌‌‌ర‌‌‌‌మైన వ్యయం, చెల్లింపులు) కింద తిరిగి కొన‌‌‌‌సాగించాల‌‌‌‌ని ఆయన కోరారు. సరిహద్దు రాష్ట్రాలతో విశాల‌‌‌‌మైన సరిహద్దు ఉండటంతో తెలంగాణ భద్రతపైన మరింత ఫోకస్​ పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 

ఎస్పీవోల నిధులు ఇవ్వండి

రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆర్ఫీఎఫ్​ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌‌‌‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఎస్పీవోల‌‌‌‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేండ్ల నుంచి పెండింగ్ లో ఉంద‌‌‌‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌‌‌‌ని ఆయన కోరారు. 

దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి స‌‌‌‌హ‌‌‌‌క‌‌‌‌రించాల‌‌‌‌న్నారు. షెడ్యూల్ 9లోని (చ‌‌‌‌ట్టంలోని 53, 68, 71 సెక్షన్ల ప్రకారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ప‌‌‌‌దిలోని సంస్థల వివాదం (చ‌‌‌‌ట్టంలోని 75 సెక్షన్ ప్రకారం) సామరస్య పూర్వక ప‌‌‌‌రిష్కారానికి కృషి చేయాల‌‌‌‌ని ఆయన కోరారు. విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌‌‌‌, అందులో తెలంగాణ‌‌‌‌కు న్యాయం జ‌‌‌‌రిగేలా చొర‌‌‌‌వ చూపాల‌‌‌‌ని కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.