- మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ స్టూడెంట్లకు సీఎం హామీ
- వర్చువల్‌గా మాట్లాడిన రేవంత్
రెంజల్ (నవీపేట్), వెలుగు : బోధన్ పర్యటనకు వచ్చినప్పుడు రెంజల్ లోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ కు వస్తానని సీఎం రేవంత్‌రెడ్డి స్టూడెంట్లకు హామీ ఇచ్చారు. మైనారిటీ స్కూల్కొత్త బిల్డింగ్‌ను బోధన్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడారు. సమయం లేకపోవడంవల్ల బిల్డింగ్ ప్రారంభానికి రాలేక పోయినట్టు చెప్పారు. బిల్డింగ్ ప్రారంభించిన తర్వాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిఉందని చెప్పారు.
అద్దె భవనాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ కు కొత్త బిల్డింగ్ లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. స్కూళ్లలో టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జడ్పీ చైర్మన్ విఠల్ రావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డిస్ట్రిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి, జడ్పీటీసీ విజయసంతోష్, కాంగ్రెస్ లీడర్లు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మోబిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ బాయ్స్ స్కూల్ కూడా..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం కంజరలో బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్‌ను కూడా సీఎం రేవంత్ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఉన్నారు