
వెలుగు, ఇబ్రహీంపట్నం: తన పీఆర్ఓ బిడ్డ పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. గురువారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో సీఎం పీఆర్ఓ పురుషోత్తంరెడ్డి కుమార్తె వివాహం జరిగింది. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి, అల్లుడు సత్యనారాయణరెడ్డితో కలిసి హాజరయ్యారు.
వధూవరులను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్మల్ రెడ్డి రాంరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.