జంగా రాఘవ రెడ్డి బిడ్డ పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి

జంగా రాఘవ రెడ్డి బిడ్డ పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి

కాజీపేట, తొర్రూరు, వెలుగు: రాష్ట్ర ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి బిడ్డ పెండ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం హన్మకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి గార్డెన్స్​లో జంగారాఘవరెడ్డి సుజాత దంపతుల కూతురు డాక్టర్ నిఖితారెడ్డి, డాక్టర్ అవినాశ్​​రెడ్డిల వివాహం జరిగింది. హైదరాబాద్ నుంచి మడికొండకు హెలికాప్టర్​లో వచ్చిన సీఎం రేవంత్.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన వివాహవేదిక వద్దకు చేరుకున్నారు.

వధూవరులకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఉన్నారు. అనంతరం సీఎం తిరిగి హైదరాబాద్​కు చేరుకున్నారు. ఈ వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, యశస్వినీ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, జాటోతు రాంచంద్రునాయక్, కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు.

ఝాన్సీ రెడ్డికి రేవంత్ పరామర్శ 

పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి హనుమండ్ల ఝాన్సీ రెడ్డిని సీఎం రేవంత్​రెడ్డి హైదరాబాద్​లోని ఆమె ఇంట్లో పరామర్శించారు. తొర్రూరులో జరిగిన కార్యక్రమంలో గాయపడిన ఆమె బంజారాహిల్స్​లోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి ఆమెను సీఎం పరామర్శించారు.