హైదరాబాద్‍లోని రవీంద్రభారతిలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం ప్రధానోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైయ్యారు. ఆయనతో పాటు మీడియా అకాడెమీ ఛెర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, పాశం యాదగిరి, ప్రొఫెసర్ హరగోపాల్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పత్రికలు, టీవీ లకు స్వేచ్ఛ ఇస్తూ.. వారి సమస్యలను పరిష్కరించేలా మా ప్రభ్యత్వం ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తి, వాటిని పరిష్కరించే అవకాశం ఒక్క జర్నలిస్టులకు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. ఇండియాటుడే మాజీ ఎడిటర్‌కు వెంకట్ నారాయణకి పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ పాత్రికేయ అవార్డును ముఖ్యమంత్రి అందజేశారు.
జాతీయస్థాయిలో మన తెలుగు వారి ప్రాబల్యం తగ్గిపోతుందని, ఢిల్లీలో వివిధ రంగాలలో ప్రభావితం చేసే తెలుగు వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం చెప్పారు. గతంలో పీవీ, ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు జాతీయస్థాయిలో తెలుగు జాతి సత్తా చాటారని గుర్తు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణకి తన చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. పరిశోదనాత్మక వార్తలతో పెద్ద పెద్ద నాయకుల అవితీని సైతం బయట పెట్టొచ్చని అన్నారు. నారాయణ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇన్వెస్టిగేషన్ వార్తలు రాశారని కొనియాడారు.