- సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు సీజే, పద్మ అవార్డు గ్రహీతల హాజరు
- పలువురు ప్రముఖులకు అవార్డులు అందజేసిన గవర్నర్
హైదరాబద్, వెలుగు: రిపబ్లిక్‌డే సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ లో ఎట్ హోం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, కన్హా శాంతివనం డైరెక్టర్ కమలేశ్ డి.పాటిల్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు హైకోర్టు జడ్జీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత నాగేశ్వర్ రెడ్డి, పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగలు అటెండ్ అయ్యారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాలేదు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ను మీడియా ప్రశ్నించగా రాజ్యాంగం మీద బీఆర్ఎస్ కు గౌరవం లేదని అందుకే అటెండ్ కాలేదని అన్నారు. కాగా జిల్లాల్లో నాలుగు స్కీంల లాంచింగ్ ఉన్నందున డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, సురేఖ, కోమటిరెడ్డి, దామోదర, తుమ్మల అటెండ్ కాలేదు.
పద్మ అవార్డుల గ్రహీతలకు అభినందనలు
ఎట్ హోం సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అభినందించారు. ఏఐజీ చైర్మన్ పద్మవిభూషణ్ నాగేశ్వర్ రెడ్డి, ఎంఆర్ పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. దీనితోపాటు గవర్నర్ ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన వివిధ రంగాల నిపుణులు, సంస్థలకు గవర్నర్ అవార్డులు అందించి సన్మానించారు కార్యక్రమంలో సినీనటి సంయుక్తా మీనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
గవర్నర్ తో సీఎం భేటీ
ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో దాదాపు 30 నిమిషాలకు పైగా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ను ఆమోదించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించటం, నాలుగు స్కీమ్ లు లాంచింగ్, పంచాయతీ ఎన్నికలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తున్నది.
లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు
1.డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి,
ఐ.ఎఫ్.ఎస్., (పర్యావరణ పరిరక్షణ)
వ్యక్తిగత అవార్డులు
2. దుశర్ల సత్యనారాయణ
(పర్యావరణ పరిరక్షణ)
3. అరికపూడి రఘు (వికలాంగుల సంక్షేమం)
4. జీవన్‌జీ దీప్తి (ఆటలు , క్రీడలు)
5. పి.బి.కృష్ణ భారతి (సంస్కృతి)
6. ప్రొఫెసర్ యం.
పాండు రంగారావు (సంస్కృతి)
సంస్థాగత విభాగము:
7. ధ్రువాంశ్ ఆర్గనైజేషన్
(పర్యావరణ పరిరక్షణ)
8. ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (వికలాంగుల సంక్షేమం)
9. ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఆటలు మరియు క్రీడలు)
10. సంస్కృతి ఫౌండేషన్ (సంస్కృతి)