పర్సనల్ అసిస్టెంట్ కూతురు పెళ్లికి.. ఫ్యామిలీతో అటెండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి

పర్సనల్ అసిస్టెంట్ కూతురు పెళ్లికి.. ఫ్యామిలీతో అటెండ్ అయిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడా లో  బీఎంఆర్ సార్థ గార్డెన్స్ లో జరిగిన వివాహ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. 

ముఖ్యమంత్రి పర్సనల్  అసిస్టెంట్ పురుషోత్తంరెడ్డి కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ముఖ్యమంత్రి దంపతులు. సీఎం రేవంత్ కూతురు, అల్లుడు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. 

అదే విధంగా ఎమ్మేల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డి, చిలుక మధు సుధన్ రెడ్డి సహా పలువురు నాయకులు వివాహానికి హాజరయ్యారు.