
వివాహ బంధంతో ఒక్కటైన ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, వెంకట దత్త సాయిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సింధు, దత్తసాయి రిసెప్షన్‌కు హాజరైన సీఎం బొకే అందజేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు కూడా రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.