- నేను కొన్నప్పుడు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందని తెలియదు
- కాస్త టైమ్ ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెల్లడి
మాదాపూర్, వెలుగు: తన ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి చెప్పారు. అధికారుల నుంచి అందిన నోటీసులపై ఆయన స్పందించారు. గురువారం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘నేను 2016-–2017లో అమర్ సొసైటీలో ఇల్లు కొనుగోలు చేశాను. నేను కొన్నప్పుడు ఈ బిల్డింగ్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి.
ఎఫ్టీఎల్పరిధిలో ఉన్నట్టు నాకు తెలియదు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని వాల్టా యాక్ట్‌ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అధికారులెవరూ నన్ను కలవలేదు. 1995లోనే హుడా అమర్‌సొసైటీ లేఅవుట్‌కు పర్మిషన్ ఇచ్చింది. నా ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చేయండి.
నాకు టైమ్ ఇస్తే ఇంట్లోని సామాన్లు తీసుకొని బయటకు వెళ్తాను” అని తిరుపతి రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్వాళ్లు తన ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత పదేండ్లలో బీఆర్ఎస్వాళ్లు ఎన్నో అక్రమాలు చేశారని ఫైర్ అయ్యారు.