దుర్గం చెరువు FTL.. ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో తన ఇల్లు ఉందని ప్రభుత్వం నిర్థారణకు వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదంటూ.. రెవెన్యూ శాఖ నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.
2015లో మాదాపూర్ అమర్ సొసైటీలో ఇళ్లు కొనుగోలు చేసినప్పుడు దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్)లో పరిధిలో ఉన్నట్లు సమాచారం తనకు తెలియదన్నారు తిరుపతి రెడ్డి. తన భవనం ఎఫ్‌టిఎల్‌లో ఉందని ప్రభుత్వం నిర్దారిస్తే ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నా తాను సిద్ధమన్నారు.
Also Read :- భీమారంలో పీహెచ్సీకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్
దుర్గం చెరువు పరిసరాల్లోని 204 నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు ఆగస్టు 29న నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఉన్నారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కో ఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్ లోని నివాసాలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. మొత్తం 204 మందికి నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇల్లు అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు.. లగ్జరీ విల్లాలు.. లగ్జరీ అపార్ట్ మెంట్స్ ఉన్నాయి. దుర్గం చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలే ఉన్నాయి. ఒక్కొక్కరు వందల కోట్ల రూపాయలతో ఈ ఇళ్లను నిర్మించుకున్నారు. నోటీసులు అందుకున్న 204 ఇళ్లు.. దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. 30 రోజుల్లో ఈ 204 ఇళ్లను కూల్చేస్తారా లేదా అనేది చూడాలి.
మరో వైపు నిభంధనలు ఉల్లంఘించారని రుజువైతే.. వాళ్లు ఫ్యామిలీ అయినా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..