సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి గుండెపోటు

సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. మార్చి 7న ఉదయం హార్ట్ స్ట్రోక్  రావడంతో  హుటాహుటిన ఆయనను చికిత్స కోసం  మాదాపూర్ మెడికేర్ హాస్పిటల్ లో  చేర్పించారు.  డాక్టర్లు ఆయనకు   స్టెంట్ వేశారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని  వెల్లడించారు రేవంత్ కుటుంబ సభ్యులు.

రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్  నియోజకవర్గ బాధ్యతలను తిరుపతిరెడ్డి చూసుకుంటున్నారు. 

ALSO READ :- ఖమ్మం మీటింగ్లో బీఆర్ఎస్కు నిరసన సెగ