మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించాలని ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? అని ప్రశ్నించారు. ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తే.. తానే హరీశ్ దగ్గరికి అధికారులను పంపిస్తానని చెప్పారు రేవంత్ . గతంలో హరీశ్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేశారు.. రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉంది.. పువ్వాడ అజయ్ కుమార్ అక్రమాలను తొలగించడానికి చిత్తశుద్ధితో సహకరిస్తారా?. ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి.. తర్వాతే మా చిత్తశుద్ధిని ప్రశ్నించండి..అంటూ హరీశ్ రావ్ కు రేవంత్ సవాల్ విసిరారు.
ALSO READ : జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ... చెరువులు,కుంటల ఆక్రమణల లిస్ట్ తీయండి
మహబూబాబాద్ జిల్లాలో వరదలపై అధికారులతో రివ్యూ చేసిన రేవంత్.. జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు చెప్పారు.వరదలకు నలుగురు చనిపోవడం బాధాకరమన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని..చనిపోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షలు తక్షణమే అందివ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు రేవంత్. పశువులకు 50 వేలు..మేకలకు 5 వేలు ఇవ్వాలని చెప్పారు.