
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ..11 ఏళ్లు మోదీ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు తాను చర్చకు సిద్ధమని.. కేసీఆర్, కిషన్ రెడ్డి చర్చకు రావాలన్నారు. చర్చలో తాను ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు రేవంత్.
ప్రజాపాలన బాగలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యగాలిచ్చాం..21 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పారు. పరిశ్రమలు ,ప్రాజెక్టులు రాకుండా బీఆర్ఎస్,బీజేపీ అడ్డుకుంటుందని మండిపడ్డారు రేవంత్.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్, నారాయణపేట్ ,కొడంగల్ ప్రాజెక్టులను మొదలు పెట్టానన్నారు రేవంత్. కేసీఆర్ గట్టిగా కొడతానంటున్నావ్.. గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా.. ఆఫా.. కొట్టాలనుకుంటే ముందుగా మీ బిడ్డను ,కొడుకును, అల్లుడిని కొట్టు..మమ్మల్ని కొడితే మా కార్యకర్తలు ఊరుకుంటారా? ఇచ్చిన హామీలను ఐదేళ్లలో పూర్తి చేసే బాద్యత నాదే అని రేవంత్ అన్నారు.