కేసీఆర్ సభకు వచ్చినప్పుడే.. కృష్ణా జలాలపై చర్చిద్దాం..మాది తప్పని నిరూనిస్తే క్షమాపణ చెప్తా

కేసీఆర్ సభకు వచ్చినప్పుడే.. కృష్ణా  జలాలపై చర్చిద్దాం..మాది తప్పని నిరూనిస్తే  క్షమాపణ చెప్తా

కేసీఆర్ అసెంబ్లీకి  వచ్చిన నాడే కృష్ణనది జలాలపై చర్చ పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు కృష్ణాజలాల విషయంలో కేసీఆర్ ఉన్నప్పుడే అన్యాయం జరిగింది..తప్పని నిరూపిస్తే  క్షమాపణలు చెప్తామన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 10 టీఎంసీలు ఏపీ తరలించుకుపోతుందని ఆరోపించారు. రోజమ్మ ఇంటికి వెళ్లి రొయ్యల పులుసు తిని ఏపీకి నీళ్లు అప్పగించారని ఆరోపించారు రేవంత్. 

 ఏపీ  బలగాలు  నాగార్జున సాగర్ పైకి వస్తే ఏం చేశారని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ పోలీసులను కొడితే కేసీఆర్ కు యీమె నెత్తురు రాలేదా అని ప్రశ్నించారు. గుండెల్లో పెట్టుకుని ఎంపీని చేస్తే గుండెల మీద తంతారా అని ప్రశ్నించారు రేవంత్.   తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్బంగా రేవంత్ మాట్లాడారు. వాటా ప్రకారం 68.32 నిష్పత్తిలో మనకు నీళ్లు రావాలన్నారు. ఇదే విషయాన్ని పదే పదే కేంద్రానికి చెప్పామన్నారు రేవంత్. మామా అల్లుళ్లు పైశాచిక ఆనందం పడటంలో ఉగాండ అధ్యక్షుడితో పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు రేవంత్.

Also Read : 14 నెలల్లో 56 వేల ఉద్యోగాలిచ్చాం

రేవంత్ కామెంట్స్ 

  • రాజ్యంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయి
  • గతంలో గవర్నర్ స్పీచ్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి
  • ప్రజాస్వామ్యం,ప్రభుత్వాలు ఏ ఒక్క వ్యక్తుల సొంతం కాదు
  • బలహీన వర్గాలకు చెందిన మహిళ గవర్నర్ గా ఉంటే కించపరిచారు
  • సూటిపోటి మాటలతో మహిళా గవర్నర్ ను  అవహేళన చేశారు.
  • గవర్నర్ స్పీచ్ ను బీఆర్ఎస్ ఎందుకు తప్పుబడుతోంది
  • గవర్నర్ ప్రసంగం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గుర్తు చేయడమే
  • గవర్నర్ ప్రసంగాన్ని గాంధీభవన్ ప్రెస్ మీట్ అంటారా
  • పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఇలానే మాట్లాడుతారా?
  • అజ్ఞానమే బీఆర్ఎస్ విజ్ఞానంగా భావిస్తోంది
  • గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా  ఎలా ఉంటుంది
  • మంత్రివర్గం ఆమోదించిన స్పీచ్ నే గవర్నర్ చదువుతారు
  • కనీసం అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు
  • మాట్లాడాలనుకున్నదే మాట్లాడుతాం.. లేకుంటే వెళ్తామన్నట్లు చేస్తున్నారు.
  • బీఆర్ఎస్ ఇలానే ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల్లో  ఆ పార్టీ గుండు సున్నా అవుతుంది
  • ప్రభుత్వానికి సూచనలు ఇస్తే తీసుకుంటాం
  • రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిది
  • సాయుధ రైతాంగా పోరాటం భూమి కోసమే జరిగింది
  • అమ్మ ఎంతనో  భూ మాత  అంత
  • తెలంగాణ ప్రజలకు భూమి ఆత్మగౌరవం
  • అవమానాలు భరించలేకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
  • రైతుల ఆత్మహత్యలకు కారణం మోహమాటమే
  • ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశాం
  • రైతులు ఆత్మగౌరవంతో  బతకాలన్నదే మా విధానం
  • రూ.16 వేల కోట్ల రుణమాఫీని కార్పొరేట్లకు మోదీ చేయలేదా?
  • 25 వే లకోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మాది
  • రైతులకు స్వచ్ఛను ఇచ్చిన చరిత్ర మాది కాంగ్రెస్
  • కాళేశ్వరం లేకుండానే ఏడాదిలోనే  కోటి 56లక్షల  మెట్రిక్ టన్నుల  దాన్యం పండించారు.
  • 260 మెట్రిక్ టన్నుల దాన్యం పండింది
  • బీఆర్ఎస్ ఎగ్గొట్టిన రైతుభరోసా మేం ఇచ్చారు
  • భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ సాయం చేస్తున్నాం
  • రైతులకు రుణవిముక్తి చేసి రైతులు ల ఎ్తుకునే చేసి
  • ఉపాధి హామీ కూలి కార్డ్ ఉన్ ప్రతి పేద వారికి రూ.12 వేలు ఇస్తున్నాం
  •  తెలంగాణ రైతంగానికి మరణ శాసనం రాసింది మీరు కాదా
  • 299టీఎంసీలకు ఒప్పుకుంది కేసీఆర్ కాదా?
  • వాటా ప్రకారం 68.32 నిష్పత్తిలో మనకు నీళ్లు రావాలి
  •  ఇదే విషయాన్ి పదే పదే కేంద్రానికి చెప్పాం
  • కాలేశ్వరం కట్టడం,కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది
  •  పాలమూరు,నల్గొండ జిల్లాను ఏడారి చేసిందే  బీఆర్ఎస్
  • ఆనాడు పోతిరెడ్డిపాడును అడ్డుకుని ఉంటే ఈపరిస్థితి వచ్చేది కాదు
  • పోతిరెడ్డి పాడు,ముచ్చుమర్రి నుంచి నీటిని ఏపీ తరలించుకుపోతున్నారు
  • ఎస్ఎల్ బీసీ ప్రమాదానికి బీఆర్ఎస్ కారాణం కాదా?