
కేసీఆర్ ను కాపాడేందుకే.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని బీజేపీ అడుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుతుందని.. దాని గురించి తాను మాట్లాడనన్నారు. జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. రైతు రుణమాఫి పండ్రాగస్ట్ లోపు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి అనుమానం అవసరం లేదని చెప్పారు. రైతు భరోసపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
సంక్షేమం పేదోడికి ఇవ్వాలి.. పెద్దోడికి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్.. వెంచర్లు, ఫామ్ హౌస్ లు, గుట్టలు, రోడ్లకు సైతం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. అలా ఇవ్వకూడదన్నదే మా సర్కార్ అభిప్రాయమన్నారు. రైతు భందు, రుణమాఫీపై కేసిఆర్ ది వితండ వాదమని చెప్పారు.
కొత్త బీరు బ్రాండ్ లపై బీవరేజ్ కార్పొరేషన్ చూసుకుంటుందన్నారు.
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలిచ్చామంటున్న కేసిఆర్.. ఉద్యోగుల లిస్ట్ విడుదల చెయ్యొచ్చుగా అని చురకలంటించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి తనను అప్పాయింట్ మెంట్ అడగలేదని చెప్పారు. సచివాలయానికి ఎవరు వచ్చినా కలుస్తానన్నారు. ఉద్యోగుల్లో జవాబుదారి కోసం .. సచివాలయం నుండి మొదలు పెడతామన్నారు. సీఎం, సీఎస్ లకు బయోమెట్రిక్ పెడతామని చెప్పారు.