ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు: చిట్ చాట్‎లో సీఎం రేవంత్ రెడ్డి

ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు: చిట్ చాట్‎లో సీఎం రేవంత్ రెడ్డి

 ఖమ్మం జిల్లాలో వరదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ స్థానిక మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలో వరదలకు అక్రమణలే కారణమని అన్నారు. గతంలో గొలుసు కట్టు చెరువులు ఉండేయని.. వాటిని అక్రమించి ఇళ్లు నిర్మించడంతోనే వరదలు వచ్చాయన్నారు.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా  గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. వరదలకు ఉగ్రరూపం దాల్చిన మున్నేరు రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచడంపై  ఇంజనీర్లతో మాట్లాడుతామని తెలిపారు. 

Also Read:-గుండె కరిగిపోయే దృశ్యాలు స్వయంగా చూశా

మిషన్ కాకతీయ ద్వారా  చెరువులు పటిష్టం  చేశాం అన్నారు .. మరీ గతంలో తెగని చెరువులు ఇప్పుడు ఎందుకు తెగుతున్నాయని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మిషన్ కాకతీయ అనేదే కమీషన్ కాకతీయ అని దివంగత నాయిని నర్సింహారెడ్డి అసెంబ్లీలో  చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందని.. 75  సంవత్సరాలలో ఇదే రికార్డ్ స్థాయి రెయిన్ అని అన్నారు. ఇంత భారీ స్థాయిలో విపత్తు తలెత్తిన ప్రాణనష్టం తగ్గిందంటే అది ప్రభుత్వ ముందు చూపేనని అన్నారు. వరదలపై హరీష్ మాట్లాడుతున్నారు.. ముందు మీ నాయకుడు పువ్వాడ అజయ్ ఆక్రమణలను తొలగించి ఆదర్శంగా  ఉండాలని సూచించారు. 

భారీ వర్షం, వరదల నేపథ్యంలో రాష్ట్రానికి సహయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని.. అక్కడి నుండి రిప్లై రావాల్సి ఉన్నదన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరద ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందిస్తుందని తెలిపారు. వరదల సమయంలో మా మంత్రులు ప్రజల్లోనే ఉంటున్నారు. విపత్తు సమయంలో గతంలో ముఖ్యమంత్రులు హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు. కానీ మాది చేతల ప్రభుత్వం. ఇచ్చిన హామీ మేరకు ముందు బాధితులకు  రూ.10 వేల తక్షణం  అందించామని అధికారులను ఆదేశించామని చెప్పారు. విపత్తులను ధీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా డిజాస్టర్ మెనేజ్మెంట్ సంస్థ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 

.