రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి

రేషన్ షాప్లో  సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం:  సీఎం రేవంత్ రెడ్డి

రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులు తక్కువ ధరకు పంపిణీ చేస్తామన్నారు.  చిట్ చాట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయని రేపటినుండి పరిపాలన సంక్షేమం పైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు.  రైతులు, విద్యార్థులు,త్రాగు సాగు నీరు వీటిపైనే దృష్టి పెడతానన్నారు.  

రైతురుణ మాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు.  రైతులను ఒకేసారి రుణవిముక్తులను చేస్తామని స్పష్టం చేశారు.  లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలించామని13 సీట్లు గెలుస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని .. కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుని.. నిర్ణయం ఉంటుందన్నారు. అఖిల పక్షం పెడతామని  రైతుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు.  

మిల్లర్స్ అక్రమాలు చేస్తామంటే తాట తీస్తామని హెచ్చరించారు  సీఎం రేవంత్ రెడ్డి.  మేము చెప్పిన పంటలకు మద్దతు ధర ఇస్తామని తెలిపారు.  కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని..  ఇది నిరంతరం జరుగుతుందని స్పష్టం చేశారు.  ఆరోగ్యశ్రీ కార్డుకు రేషన్ కార్డుకు  సంబంధం ఉండదన్నారు.  కార్పోరేట్ విద్యలో ఫీజుల నియంత్రణపై దృష్టి పెడతామని..  అన్ని యువర్శిటీలకు వైస్ ఛాన్సలర్ వేస్తామని వెల్లడించారు.