తల్లిని ఆహ్వానించటానికి బిడ్డకు పర్మిషన్ కావాలా..

తల్లిని ఆహ్వానించటానికి బిడ్డకు పర్మిషన్ కావాలా..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రేమను పంచటం, పెత్తనాన్ని ప్రశ్నించటమే మన తత్త్వం అని అన్నారు. ముఖ్యమంత్రి నుండి మున్సిపల్ కౌన్సిలర్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామని, మేం పాలకులం కాదు ప్రజాసేవకులమని అన్నారు. ప్రజా పాలనలో అందరికీ న్యాయం జరగటమే మా లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రజా భవన్ లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రదాత, మాతృ సమానురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తే, ఏ హోదాలో సోనియాను ఆహ్వానించారని అడుగుతున్నారని, బిడ్డ ఇంట్లో వేడుకకు రావటానికి తల్లికి హోదా అవసరమా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 

పదేళ్లలో తెలంగాణ సంపద గుప్పెడు మంది చేతిలోకి వెళ్ళిందని, ప్రజాపాలనలో ఆ పరిస్థితి మారిందని అన్నారు. యువత ఆకాంక్ష మేరకే టీఎస్ ను టీజీగా మారుస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్ర చిహ్నం చరిత్రకు నిదర్శనంగా ఉండాలని, త్వరలోనే తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని రాషట్రనికి అందించబోతున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా రాష్ట్ర గీతం లేదని, తెలంగాణ ఉన్నంత వరకు సోనియాను తెలంగాణ తల్లిగా గౌరవిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.