హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మసభల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు మహాసభల్లో మూడో రోజైన ఆదివారం ( జనవరి 5, 2025 ) సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమాఖ్య ప్రారంభమైందని.. తొలి తెలుగు మహాసభలకు వేదికైన హైదరాబాద్ మళ్ళీ 12వ తెలుగు మహాసభలకు వేదికవ్వడం సంతోషంగా ఉదని ఉందని అన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అయినప్పటికీ దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరినీ ఈ సమాఖ్య ఏకం చేసిందని అన్నారు.
కాంగ్రెస్ విధానాలతోనే నేడు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని అన్నారు. కోవిడ్ టైంలో తెలుగువాళ్ళ సత్తా ప్రపంచానికి తెలిసిందని.. కోవిడ్ వ్యాక్సిన్ మన తెలుగువాళ్లే తయారు చేశారని అన్నారు. సినిమా రంగంలోనూ తెలుగువాళ్లు రాణిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్.
జ్ఞానం కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చని.. మాట్లాడటం మాతృభాషలోనే మాట్లాడాలని అన్నారు.మలయాళీలతో పోటీ పడేలా తెలుగు వాళ్ళు ఎదుగుతున్నారని.. అమెరికా పర్యటనలో తెలుగు వాళ్ళు వచ్చి కలిస్తే చాలా సంతోషం వేసిందని అన్నారు. తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడాలని, మన ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు. విడిపోయి పోటీ పడడం కాదు.. రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలని అన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ, ఆంధ్ర ప్రపంచంతో పోటీ పడాలని.. మనలో మనం పోటిపడకూడదని అన్నారు.అవుటర్ రింగ్ రోడ్డుస్పూర్తితో 60 శాతం పట్టణీకరణ చేసేందుకు రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని అన్నారు సీఎం రేవంత్. ఫోర్త్ సిటీ నీ నూతన నగరాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామని.. అందుకు అందరూ అక్కడ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.మన రాష్ట్రంలో గొప్ప పారిశ్రామికీకరణ జరుగుతోందని.. తెలంగాణ రైసింగ్ అనే నినాదంతో 2050 విజన్ తో పని చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్.
రైతు రుణమాఫీ జీవో తెలుగులో ఉండేలా చూసుకున్నామని.. ఈమధ్య వీలైనంత జీవోలని తెలుగులోనే ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.మున్ముందు న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు తెలుగులో ఉండాలి అని ఆకాంక్షిస్తున్నానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.