హైదరాబాద్: భారత్ జోడో యాత్ర ఎంతో మందిని కదిలించిందని కులగణన సంప్రదింపుల సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని, ఇందిరా గాంధీ ‘గరీబ్ హఠావో’ అనే నినాదంతో చరిత్రలో నిలిచారని సీఎం గుర్తుచేశారు.
ప్రస్తుతం తెలంగాణలో కులగణన చారిత్రకం కాబోతోందని, రాహుల్ గాంధీ నేతలకు మాట ఇస్తే అది శాసనమని రేవంత్ చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణనపై ముందుకెళ్తున్నామని, కులగణన చేసి తెలంగాణ దేశంలో ఆదర్శంగా రాష్ట్రంగా నిలవబోతోందని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు.
Also Read : దేశ సంపద సమానంగా పంచాలంటే..
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తెలంగాణలో ప్రారంభించనున్న కుల గణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. బోయిన్ పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో ఈ సదస్సు జరిగింది.