కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు.. కక్ష.. సీఎం రేవంత్ రెడ్డి 

కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు.. కక్ష.. సీఎం రేవంత్ రెడ్డి 

కేంద్ర బడ్జెట్ పై అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రబుయిత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీలో దీక్ష చేస్తామని అన్నారు. తెలంగాణకు ఏమివ్వాలో విభజన చట్టంలో ఉందని, ఇది వివక్ష కాదు, ఖచ్చితంగా కక్షే అని అన్నారు. కేంద్రం తెలంగాణకు చాలా ఇచ్చిందని బీజేపీ వాలు అంటున్నారని, మోడీ ఎమన్నా తన గుజరాత్ ఎస్టేట్లు అమ్మి ఇచ్చారా అని మండిపడ్డారు.

రాష్ట్రానికి హక్కుగా ఇవ్వాల్సింది కేంద్రమే ఇస్తుందని, పన్నుల రూపంలో తెలంగాణ రూపాయి ఇస్తే, కేంద్రం 45పైసలు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే, కేంద్రం 7రూపాయలు ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలకు, అన్ని రంగాలకు సముచిత స్థానం కల్పించిందని అన్నారు. నెహ్రు నుంచి మన్మోహన్ వరకు అన్ని రాష్ట్రాలను సమానంగా చూసారని అన్నారు. కాంగ్రెస్ దేశాభివృద్ధికి కృషి చేసి ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెచ్చిందని అన్నారు. పదేళ్లుగా విభజన చట్టంలోని హామీలను పక్కనపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.కాగా, తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ ప్రవేశపెట్టాలంటూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.