
వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు చలాకీ కాల్చి వాత పెట్టండని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారని అన్నారు..ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ నీటి ప్రాజెక్టులను కట్టిందని అన్నారు. వనపర్తిలో ధన రాజకీయం, కక్ష రాజకీయాలు ఉండేవి కావని అన్నారు రేవంత్ రెడ్డి.
వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు కీర్తి తెచ్చే విధంగా పని చేస్తానని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి . రూ. 21కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా రైతులను అడగాలని అన్నారు.రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేశామని.. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆడబిడ్దలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్.
కేసీఆర్ గ్రహణం పట్టి డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యని.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్,ఎం బీజేపీ పార్టీలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని అన్నారు. డ్వాక్రా సంఘాలకు శిల్పారామంలో మూడున్నర ఎకరాలు ఇచ్చామని.. 150 షాపులలో అక్కడ డ్వాక్రా మహిళల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని అన్నారు. మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
ఆడబిడ్డలకు 4 లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశామని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఏడాదిలో 55 వేల 163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. ఎన్నో పనులు చేసిన తనను నువ్వు దిగుతావా లేదా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా పాలమూరు గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. SLBC ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ కారణమని అన్నారు సీఎం రేవంత్.