ఆర్టీసీపై మాటల యుద్ధం: హరీశ్ రావును తప్పించేందుకే యూనియన్ల రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి .. 

ఆర్టీసీపై మాటల యుద్ధం: హరీశ్ రావును తప్పించేందుకే యూనియన్ల రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి .. 
  •  హరీశ్ రావు X మంత్రి పొన్నం
  •  బీఆర్ఎస్ కు చర్చించే అర్హత లేదన్న కూనంనేని

హైదరాబాద్: ఆర్టీసీపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం సాగింది. గత ప్రభుత్వం ఆర్టీసీని చంపాలని చూసిందని పొన్నం ఆరోపించారు. ఆర్టీసీ యూనియన్లను గత ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు.  రూ. 280 కోట్ల బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీకి చెల్లించిందని తెలిపారు.  హరీశ్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయన్నారు.

ఆర్టీసీ గౌరవాధ్యక్షులుగా ఉన్నారని గుర్తు చేశారు. రిటైర్డ్ ఆఫీసరైన వాళ్ల బంధువును ఎండీగా పెట్టుకుని ఆర్టీసీని ఆగం చేశారని ఆరోపించారు. సమ్మె సమయంలో ఆర్టీసీ ఉండదని బెదిరించారని కార్మికులను బెదిరించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మూడు వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు బడ్జెట్ లో రూ. 1500 కోట్లు కేటాయించి 400 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, జాగాలను లీజులకు తీసుకు బకాయిలు కూడా కట్టేదని విమర్శించారు.

దీనిపై సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ.. ఆర్టీసీ యూనియన్లపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. ఆర్టీసీలో తమ పార్టీ అనుబంధం సంఘం గుర్తింపు యూనియన్ గా ఉందన్నారు. ఖమ్మంలో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఎంతో మంచి చనిపోయారని గుర్తు చేశారు. యూనియన్లను రద్దు చేసిన వారికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఇదే  సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు పోడియం దగ్గర బైఠాయించి నిరసనకు దిగారు. ఇదే ప్రశ్నపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఆర్టీసీ యూనియన్ కు గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావును తప్పించేందుకే అప్పటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంఘాల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.