గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చింది కానీ బకాయిలు చెల్లించలేదన్నారు సీఎం రేవంత్ . తాము అధికారంలోకి వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతన్నలను ఆదుకున్నామని చెప్పారు . గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కొడంగల్లో తన గెలుపులో నేతన్నల పాత్ర ఉందని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులే నేతన్నలు అని అన్నారు.
ఏడాదిలో మహిళా సంఘాల సభ్యులకు రెండు క్వాలిటీ చీరలు పంపిణీ చేస్తామన్నారు రేవంత్. అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టీకి పేరు వచ్చేలా కృషి చేస్తామన్నారు రేవంత్. ప్రధాని మోదీని కలిసి ఐఐహెచ్టీ అవసరంపై వివరించామని.. రాజకీయాలకు అతీతంగా కేంద్రం ఐఐహెచ్టీ మంజూరు చేసిందన్నారు. ఐఐహెచ్ టీ విద్యార్థులకు నెలకు రూ.2500ప్రోత్సాహం అందిస్తామన్నారు రేవంత్. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదన్నారు.విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రేవంత్ .