కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమించిన వాళ్ళను ఎవర్నీ వదలమని, ఎంత ఒత్తిడి ఉన్నా తగ్గేది లేదని స్పష్టం చేశారు. కొందరు బఫర్ జోన్లలో భవనాలు నిర్మించారని, ఆ భవనాల వ్యర్థాలను గండిపేటలో వదులుతున్నారని అన్నారు. చెరువుల సంరక్షణ ఎంతో కీలకమని, చెరువులు మన సంస్కృతీ, జీవనాదారమని అన్నారు.
సిటీలో వరదల నివారణకు నాటి నిజాం గొప్ప ప్రణాళికలు వేశారని, హైదరాబాద్ ను లేక్ సిటీగా 100ఏళ్ళ క్రితమే నిర్మించారని అన్నారు. హైదరాబాద్ దాహాన్ని తీర్చేది నిజాం, ఉస్మాన్ సాగర్లే అని అన్నారు. అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనను అనుసరించే తాను పాలన చేస్తున్నానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.