హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ విద్య దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. రాష్ట్ర అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పవర్ లోకి రావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం శ్రమిస్తోందని అన్నారు సీఎం రేవంత్. దేశంలో రెండే పరివార్ లు ఉన్నాయని.. ఒకటి మోడీ పరివార్, మరొకటి గాంధీ పరివార్ అని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మైనార్టీలను కుటుంబంగా భావిస్తున్నామని అన్నారు. మైనార్టీలు అప్పుడప్పుడు కాంగ్రెస్ పై అలక వహిస్తుంటారు కానీ.. అవసరమైనప్పుడు కాంగ్రెస్ కు అండగా ఉంటారని అన్నారు. దేశంలో మోడీ పరివార్, గాంధీ పరివార్ మాత్రమే ఉన్నాయని, దేశాన్ని విభజించేందుకు మోడీ పరివార్ ప్రయత్నిస్తోందని అన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకులా చూడటం లేదని అన్నారు సీఎం రేవంత్.
మతం పేరుతో మోడీ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. మోడీ పరివార్ ను బొందపెట్టాలని అన్నారు. హిందూ ముస్లిం భాయి భాయి అన్నదే కాంగ్రెస్ విధానమని అన్నారు సీఎం రేవంత్. మోడీని ఓడించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని, రాహుల్ గాంధీ కచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా చేసామని, అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చామని అన్నారు. కార్పొరేషన్ లలో కూడా
మైనార్టీలకు అవకాశాలు ఇచ్చామని అన్నారు. వైఎస్ తరువాత ఇప్పటి వరకు సీఎంఓ లో మైనారిటీ అధికారిని నియమించలేదని అన్నారు. మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించామని అన్నారు. దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, మోదీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోవాలని అన్నారు.
మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలని.. దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మహారాష్ట్రలో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. దేశంలో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.