మూసీ పునరుజ్జీవం: ఫస్ట్ ఫేజ్ 21 కి.మీ.. నెలరోజుల్లో డిజైన్లు పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవం: ఫస్ట్ ఫేజ్ 21 కి.మీ.. నెలరోజుల్లో డిజైన్లు పూర్తి చేస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  • నది వెంట అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ, నెచర్ క్యూర్ సెంటర్ల  ఏర్పాటు
  • నెల  రోజుల్లో డిజైన్లు పూర్తి చేస్తం
  • బాపూ ఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ కడ్తం
  • అక్కడే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తం
  • చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎవరు ఎంత అడ్డుపడ్డా మూసీ పునరుజ్జీవం ఆగదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. మొదటి ఫేస్ కింద 21 కిలోమీటర్ల వరకు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మూసీ వెంట అంతర్జాతీయ యూనివర్సిటీని గాంధీ ఐడియాలజీ, నేచర్ క్యూర్, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ ల నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడుతామని అన్నారు.

నెల రోజుల్లో డిజైన్లు పూర్తవుతాయని క్లారిటీ ఇచ్చారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామన్నారు. దీనికి సంబంధించిన ట్రంక్ లైన్ కోసం వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని వివరించారు. బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్నిఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. బాపు ఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మించనున్నట్టు తెలిపారు. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ అడిగామని అన్నారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. మూసీని ఎకో ఫ్రెండీ, వెజిటేరియన్ కాన్సెప్ట్ తో అభివృద్ధి చేయనున్నామని  తెలిపారు. 

మనకు చిచ్చుబుడ్లు వాళ్లకు సారాబుడ్లు

‘దీపావళి పండుగ అంటే మనకు చిచ్చుబుడ్లు.. వాళ్లకు మాత్రం సారాబుడ్లు.. దీపావళి దావత్ వాళ్లు అలా చేస్తారని మాకు తెల్వదు. రాజ్ పాకాల ఏం చేయకపోతే ఎందుకు పారిపోయిండు. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగిండు. దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్.. విదేశీ మద్యం ఎందుకు దొరికినయ్..’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.