![దక్షిణాది ఏకం కావాలి.. రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి..](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-comments-on-pm-modi_B8FrRKHUdX.jpg)
కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్టాలపై వివక్ష చూపుతోందని, రాజ్యాంగ బద్దంగా మనకు రావాల్సిన హక్కులు సాధించు కునేందుకు పోరాడుదామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ డీలిమిటేషన్ ఇది మోడీ ఎజెండాతో మోడీ ముందుకు సాగుతున్నారని అన్నారు. డీలిమిటేషన్ జరిగితే దక్షి ణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పాడు. పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని అన్నారు. కేరళలో ఇవాళ జరిగిన మాతృభూమి ఇంటర్నేషన ల్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు.
దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం పల్ల పార్లమెంటు స్థానాలకు గండిపడే ప్రమాదం ఉందని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు గళం విప్పాలిసిన సమయం వచ్చిందని అన్నారు. తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతోందని, 1 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా కార్యా చరణ ప్రారంభించిందని చెప్పాడంతో దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు పదేండ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం 25 వేల కోట్ల పెట్టుబడులే తెచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలల వ్యవధిలో 1.82 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్నారు.
ALSO READ | ఢిల్లీలో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషిస్తున్నారు.. ఉపఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటా: కడియం
తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సపోర్టు చేయకున్నా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు. హైదరాబాద్ ను క్లీనెస్ట్, సేఫెస్ట్, సిటీగా అభివృద్ది చేస్తున్నానని చెప్పారు కాలుష్య రహితంగా తీర్చి దిద్దడంలో భాగంగా మూడువేల ఈవీ బస్సులను కొనుగోలు చేశామని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని, అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించగలిగామని అన్నారు.
మూడు జోన్లుగా అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. హైదరాబాద్ రిలేటెడ్ అర్బన్, సెమీ అర్బన్ జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ పలు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణమవుతోందని.దానిని ఔటర్ రింగ్ రోడ్డుతో అమసంధానం చేస్తూ రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిటిన్స్ ఫార్మా రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని... యువతలో ఉన్న నైపుణ్యాలను బయటికి తెచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశామని సీఎం వివరించారు.