మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన Nuts Bolts of War and Peace పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ( డిసెంబర్ 24, 2024 ) రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని.. దీనిపై మాట్లాడటానికి ఎవరికీ దైర్యం లేదని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక భారత భూభాగాన్ని కోల్పోయామని అన్నారు.మణిపూర్ లో అంతర్యుద్ధం జరుగుతోందని.. రెండు దళిత జాతులు ఉచకోతలు కోసుకుంటున్నాయని అన్నారు.
ఖనిజ సంపద దోచుకునేందుకే రెండు జాతుల మధ్య చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అంశంపై భారత బలగాలు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలపై పార్లమెంటులో లోతైన చర్చ జరగాలని అన్నారు.భారత దేశం లో జరుగుతున్న అప్రకటిత యుద్ధంలో కూడా శాంతి నెలకొల్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత ప్రభుత్వం తెలంగాణలో కొన్ని డిఫెన్స్ సంబంధించిన పరిశ్రమలకు అనుమతి ఇచ్చారని అన్నారు.
Also Read :- ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్లపై పోలీసుల క్లారిటీ
సోషలిస్టు విదానంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని యాదవరెడ్డి నమ్మారని అన్నారు. పదవులకు అనుగుణంగా వారు ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని.. తెలంగాణ ఏర్పాటుపై యాదవరెడ్డితో సోనియా చర్చించారని అన్నారు. యాదవరెడ్డి ఏనాడూ ఏ విషయాన్ని చెప్పుకోలేదని అన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి తెరవెనక రాజకీయం నడిపారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై తెర వెనక జరిగిన కీలక విషయాలు ప్రజలకు తెలియాలని అన్నారు. ముల్కీ, నాన్ ముల్కీ నుంచి 2014 తెలంగాణ ఉద్యమం వరకు చరిత్ర తెలియాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని పుస్తక రూపంలో తేవాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం రేవంత్.