వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల నియామకాలు.. దేశ చరిత్రలోనే రికార్డ్.. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో ఆరోగ్య ఉత్సవాలు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( డిసెంబర్ 2, 2024 ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం అయితేనే రాష్ట్రం బాగుంటుందని.. అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే వైద్య ఆరోగ్యశాఖలో  ఒక ఏడాదిలోనే 14వేల నియామకాలు చేపట్టామని.. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని అన్నారు.

75 ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రేంజ్ లో నియామకాలు జరగలేదని అన్నారు సీఎం రేవంత్. శాఖలపై మంత్రులకు పట్టు ఉంటేనే సమర్థవంతంగా పనిచేయగలరని.. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఎడ్యుకేషన్ పరంగా ఇంజినీర్ అయినప్పటికీ.. బై నేచర్ ఆయన ఒక డాక్టర్ లాంటివారని అన్నారు. అందుకే ఈ శాఖలోని సమస్యలను త్వరగా గుర్తించి.. పట్టుబట్టి తనతో సంతకాలు చేయించుకున్నారని అన్నారు. 

Also Read : అంబేడ్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం

ఉద్యమ సమయంలో యువత నినదించింది ఉద్యోగాల కోసమేనని.. సబ్బండ వర్గాలు రోడ్లపైకి వస్తేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలే నడిచాయని అన్నారు. దేశ చరిత్రలో ఒకే ఏడాదిలో 55వేల నియామకాలు చేపట్టిన రాష్ట్రం లేదని అన్నారు. 213 అంబులెన్స్ లను ప్రారంభించామని.. 7వేల 750 మంది నర్సులకు నియామక పత్రాలిచ్చామని అన్నారు.పారామెడికల్ సిబ్బందితో ఈ నియామకం మొదలైందని.. 6 వేల 496 ఖాళీల భర్తీకి ఇప్పటికే పరీక్షలు నిర్వహించామని అన్నారు సీఎం రేవంత్.