బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే.. మేము నియామకాలు చేపట్టాం: సీఎం రేవంత్

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం ( డిసెంబర్ 5, 2024 ) నిర్వహించిన రవాణాశాఖ విజయోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడితే.. విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. పదేళ్లు నియామకాలు చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులో లిటిగేషన్లు వేయించారని.. వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే, తాము నియామకాలు చేపట్టామని అన్నారు.

చిక్కుముడులన్నీ విప్పి నియామక పత్రాలు ఇచ్చామని.. ఏ సీఎం అయినా ఇంత పెద్దఎత్తున నియామకాలు చేపట్టలేదని అన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి నెల ప్రతి మహిళకు రూ. 5వేల నుంచి రూ. 7వేల వరకు మిగులుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు 115 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని అన్నారు.

రూ. 4వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి బదిలీ చేసిందని అన్నారు సీఎం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పడుతోందని అన్నారు. ఉచిత గ్యాస్, కరెంట్, సిలిండర్ పథకాల ద్వారా ప్రతినెలా ఇంటింటికీ రూ. 10వేల ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రూ. 21వేల కోట్ల రుణమాఫీ చేశామని.. 25లక్షల మంది రైతులను అప్పుల ఊబి నుండి బయట పదేశమని అన్నారు సీఎం రేవంత్.