జిట్టా మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్బ్రాంతి కలిగించింది. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియీశీలక పోత్ర పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు జిట్టా అని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం. 

జిట్టా బాలకృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఎక్స్ లో పోస్టు ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.