హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​

హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు: హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. నిజమైన నేత కార్మికులకు లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు. శుక్రవారం సెక్రటేరియట్​లో  తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టీజీసీవో) పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15 తర్వాత యూనిఫామ్ ప్రొక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లోనూ ప్రభుత్వ  సంస్థల నుంచే క్లాత్ ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫలితంగా నేత కార్మికులకు మరింత ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

అలాగే, మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీసీవో ఎండీ శైలజా రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.