హైదరాబాద్, వెలుగు : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ మీటింగ్‌లో మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విప్ రాంచంద్ర నాయక్, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అదే సమావేశం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. పరస్పర సహకారంతో విభజన, పెండింగ్సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు.