దీప్తి జీవాంజికి గ్రూప్​ 2 ఉద్యోగం.. రూ.కోటి నగదు

దీప్తి జీవాంజికి గ్రూప్​ 2 ఉద్యోగం.. రూ.కోటి నగదు
  • అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు. శనివారం సీఎం రేవంత్ ను జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆమె కలిశారు. ఈ సందర్భంగా గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పారాలింపిక్స్ లో పాల్గొన్నవారికి కోచింగ్, ఇతర ప్రోత్సాహకాలు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం దీప్తి మాట్లాడుతూ.. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.