తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు

 హైదరాబాద్: తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకు రావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులు ఎగరేసేటప్పుడు జాత్రగత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని అన్నారు. ఇక, సంక్రాంతి పండుగకు వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ ఖాళీ అయ్యింది. నగరవాసులంతా పల్లె బాట పట్టడంతో నిత్యం వాహనాల రద్దీతో ఉండే రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. సొంత గ్రామాల్లో కుటుంబ సమేతంగా పండుగ జరుపుకునేందుకు ఉద్యోగులు, పిల్లలు ఊర్లకు బయలుదేరి వెళ్లారు.