సినారె చదివిన బడిలో వజ్రోత్సవ వేడుకలు

సినారె చదివిన బడిలో వజ్రోత్సవ వేడుకలు
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

వేములవాడ రూరల్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ ​మండలం హన్మాజిపేట ప్రభుత్వ పాఠశాల 75 ఏండ్ల వజ్రోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశ లేఖ పంపారు. తెలుగు సాహితీ లోకంలో సుప్రసిద్ధ కవి, రచయిత,  జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత  సి.నారాయణరెడ్డి సొంతూరు హన్మాజిపేటలో ఆయన చదువుకున్న బడిని రాజ్యసభ మెంబర్ గా ఉన్నప్పుడు పునర్నిర్మించటం స్ఫూర్తిదాయకమన్నారు.

ఆయన ఆశయాలు, ఆలోచనలు.. అడుగుజాడలు హన్మాజిపేటను రాష్ట్రంలోనే ఉన్నతమైన ఆదర్శాలకు నిలయంగా తీర్చిదిద్దాయన్నారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకలను నిర్వహించటం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులు, ఉపాధ్యాయులు, పూర్వ విదార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా మొదటి రోజు గ్రామంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కబడ్డీ ఆడారు.