నేను CM అయిన రెండో రోజే KCR గుండె పగిలింది: రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నేను CM అయిన రెండో రోజే KCR గుండె పగిలింది: రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: నేను సీఎం అయినా రెండో రోజే కేసీఆర్ గుండె పగిలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రసంగంలో పసలేదని.. ప్రభుత్వంపై ఆయన అక్కసంతా వెళ్లగక్కారని విమర్శించారు. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

కేసీఆర్ ఎన్ని చెప్పినా.. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారన్నారు. కేసీఆర్ ప్రసంగంలో స్పష్టతే లేదన్నారు. మా పిల్లలనే అసెంబ్లీలో ఎదుర్కొలేకపోతున్నారని కేసీఆర్ అంటున్నారు.. వాళ్ళు పిల్లలు అని తెలిశాక మరీ అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. 

►ALSO READ | భూదాన్ భూముల ఇష్యూ.. ఓల్డ్ సిటీలో ఈడీ తనిఖీలు

మేం కక్ష సాధింపు చర్యలకు దిగమని.. తాను ఇంకో 20 ఏండ్లు రాజకీయాల్లో ఉంటానని తెలిపారు. కేటీఆర్ కేసు అయినా.. ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా చట్టపరంగానే ముందుకు వెళ్తామని  స్పష్టం చేశారు. కేసీఆర్ మాదిరిగా చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెట్టి జైల్లో వేయించమన్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులపై డిమాండ్లు వస్తున్నాయని.. కానీ చట్టప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర పథకాల ప్లానింగ్ కే సరిపోయిందని.. ఇకపై పథకాల గ్రౌండింగ్ పై ఫోకస్ పెడతామని చెప్పారు. కేసీఆర్ మాదిరిగా లాంఛింగ్.. క్లోజింగ్ స్కీములు ఉండవని.. ఏదైనా ఒక పథకం ప్రారంభిస్తే అర్హులకు అందేవరకు పని చేస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేస్తాడు అనే నమ్మకం కలిగేలా పని చేస్తానని పేర్కొన్నారు.