హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఎన్నో హామీలు అడిగితే ప్రధాని మోదీ మాత్రం గాడిద గుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పదేండ్లుగా తెలంగాణ విభజన హామీలను అమలు చేయమని అడిగితే మోదీ మాత్రం మొండి చెయ్యి చూపారని తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు వివిధ అంశాలపై ట్వీట్ చేశారు.
పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదాను తెలంగాణ ప్రజలు అడిగారనీ, బీజేపీ మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డని వెల్లడించారు. పదేండ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అని విమర్శించారు.