
- అధికారం పోయిందన్న దుఃఖంలో బీఆర్ఎస్ నేతలు
- కొడంగల్‌ను దెబ్బతీసేందుకు వారు కుట్రలు చేస్తున్నరు
- అభివృద్ధికి అడ్డుపడే వాళ్లను ప్రజలు వదలరని హెచ్చరిక
కొడంగల్, వెలుగు: అంబేద్కర్‌ను అవమానించేలా పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడారని, గాంధీని చంపి నవారిని ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయ ని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘అంబేద్కర్‌ను ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలను పెట్టి ఆరాధిస్తున్నారు. అలాంటి మహనీయుడిపై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయ డం దారుణం. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిచోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజలు చాటుతున్నారు” అని తెలిపారు. శనివారం కొడంగల్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ సన్నాహక సమావేశంలో సీఎం మాట్లాడారు.
కొడంగల్‌ను అద్దంలా తీర్చిదిద్దుతా
ముఖ్యమంత్రిగా తనకు ఈ బలం, ఈ శక్తినిచ్చింది కొడంగల్ ప్రజలేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందనే కేసీఆర్ రావడంలేదు. ఆయన తరఫున వచ్చినోళ్లకు ఓనమాలు కూడా రావు.. చెప్పినా నేర్చు కోరు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధి కారం కొడంగల్‌కు పోయిందన్న దుఃఖంలో బీఆర్ఎస్ వాళ్లు ఉన్నారు.
అందుకే కొడంగల్‌ను దెబ్బతీసేం దుకు కుట్రలు చేస్తున్నారు” అని ఆయన మండిపడ్డారు. పదేండ్లు సీఎం కుర్చీ కొడంగల్‌కే ఉంటుందని తెలిపారు. పదేండ్లలో కొడంగల్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకుందామని సూచించారు. ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టి భూసేక రణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు స్థానికంగా ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు.
పరిశ్రమలు లేకపోవడం వల్లే ఇక్కడి ప్రజలు వలసలు వెళ్తున్నారని అన్నారు. ‘‘మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి, మీ కండ్లలో ఆనందం చూడాలన్నదే నా తాపత్ర యం. రానున్న పదేండ్లలో రూ.10 వేల కోట్లతో కొడం గల్ను అద్దంలా తీర్చిదిద్దుతా” అని హామీ ఇచ్చారు. కొడంగల్ భూముల విలువ ఎకరానికి కోటి పెరగా లంటే ఇక్కడ అభివృద్ధి జరగాలన్నారు. అభివృద్ధికి అడ్డుపడే ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వద లరని ఆయన హెచ్చరించారు. సమావేశంలో ఎంపీ మల్లు రవి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.